ఆమెది గర్భం కాదు..గంజాయి వనం

క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు మహిళలు కూడా తామేమీ అతితులం కామని నిరూపించుకుంటున్నారు. పైగా క్రైమ్ నిర్వచనానికి సైతం అందని రీతిలో రెచ్చిపోతున్నారు. తాజా సంఘటన చూస్తే..జనాల ఆలోచనా ధోరణి తప్పుడు పనులను ఎంతగా ప్రోత్సహిస్తుందో  అర్థం చేేసుకోవచ్చు. ఇదే మైండ్‌సెట్‌ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే..సొసైటీ కూడా బాగుపడుతుంది. మాములుగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే..ఇబ్బందులు తప్పవని భావించిన ఓ మహిళ..అమ్మదనాన్నే అందుకు పావుగా ఉపయోగించుకుంది. సరిగ్గా నిండు గర్భిణీలా ఓ సంచిలో గంజాయిని కుక్కి..దాన్ని […]

ఆమెది గర్భం కాదు..గంజాయి వనం

క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు మహిళలు కూడా తామేమీ అతితులం కామని నిరూపించుకుంటున్నారు. పైగా క్రైమ్ నిర్వచనానికి సైతం అందని రీతిలో రెచ్చిపోతున్నారు. తాజా సంఘటన చూస్తే..జనాల ఆలోచనా ధోరణి తప్పుడు పనులను ఎంతగా ప్రోత్సహిస్తుందో  అర్థం చేేసుకోవచ్చు. ఇదే మైండ్‌సెట్‌ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే..సొసైటీ కూడా బాగుపడుతుంది. మాములుగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే..ఇబ్బందులు తప్పవని భావించిన ఓ మహిళ..అమ్మదనాన్నే అందుకు పావుగా ఉపయోగించుకుంది. సరిగ్గా నిండు గర్భిణీలా ఓ సంచిలో గంజాయిని కుక్కి..దాన్ని ఓ వల ఆకారంలో ఉండే షర్ట్‌తో బాడీకి అమర్చుకుంది. కానీ ఎంత పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ ఆమె పాచికలు పారలేదు.

అర్జెంటీనాకు చెందిన ఈ మహిళ తన భర్తతో కలిసి మెండోజా నుంచి శాంత్‌ క్రూజ్‌కు ఇలా గంజాయి సప్లై చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో రైల్వే పోలీసులు అతని బ్యాగ్ చెక్ చెయ్యగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో పూర్తి స్థాయితో అతని భార్యను కూడా పరిశీలించగా..కిలాడీ లేడీ కహానీ బయటపడింది.