‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?

టైటిల్: తెనాలి రామకృష్ణ బిఏ, బిఎల్ యాక్టర్స్: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు డైరెక్టర్: జి నాగేశ్వర్ రెడ్డి ప్రొడ్యూసర్స్: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ మ్యూజిక్: సాయి కార్తిక్ డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్ కథ : టి రాజసింహ విడుదల తేదీ: 15.11.2019 టాలీవుడ్‌లో సందీప్ కిషన్‌కి మంచి పేరుంది. మొదటి నుంచీ.. విచిత్రమైన […]

'తెనాలి రామకృష్ణ' మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 4:06 PM

టైటిల్: తెనాలి రామకృష్ణ బిఏ, బిఎల్ యాక్టర్స్: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు డైరెక్టర్: జి నాగేశ్వర్ రెడ్డి ప్రొడ్యూసర్స్: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ మ్యూజిక్: సాయి కార్తిక్ డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్ కథ : టి రాజసింహ విడుదల తేదీ: 15.11.2019

టాలీవుడ్‌లో సందీప్ కిషన్‌కి మంచి పేరుంది. మొదటి నుంచీ.. విచిత్రమైన కథలను ఎంచుకుంటూ.. చిత్ర పరిశ్రమలో బాగానే పేరు సంపాదించాడు. అలాగే.. కామెడీపై దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డికి మంచి పట్టుంది. ప్రతీ సినిమాలో తన మార్క్‌ని చూపిస్తూంటారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌ అంటే.. సినిమాపై భారీగానే అంచనాలుంటాయి. మరి.. వీరి కాంబోలో వచ్చిన సరికొత్త ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్’ సినిమాలో సందీప్ సక్సెస్ అయ్యాడా..? డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి తన మార్క్‌ను చూపించారా..? అన్నది తెలియాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే.

కథ: సందీప్ కిషన్ ఓ లాయర్. కోర్టులో కేసు వాదించి.. మంచి లాయర్‌గా పేరు సంపాదించాలని అతని కోరిక. కానీ.. మొదటి నుంచీ సందీప్‌కి ఒక్క కేసు కూడా రాదు. దీంతో.. చాలా ఆఫర్లు ప్రకటిస్తాడు. అయినా ప్రయోజనం ఉండదు. ఇలా సాగుతుండగా.. అతనికి హన్సిక పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సందీప్. హన్సికతో ప్రేమాయణం కొనసాగిస్తూనే.. పెండింగ్ కేసుల గురించి తెలుసుకొని.. ఇరు వర్గాల్ని రాజీ చేస్తూ.. సొమ్ము చేసుకుంటూంటాడు. ఈ సందర్భంలోనే అనుకోకుండా.. పొలిటికల్ లీడర్‌ అయిన.. వరలక్ష్మి కేసును ఒప్పుకుంటాడు. ఈ కేసే సందీప్ జీవితాన్ని రివర్స్ చేస్తుంది. మొత్తానికి ఏదోవిధంగా ఆమెను గెలిపిస్తాడు లాయర్ సందీప్. అయితే.. కేసు గెలిచాక.. మరో ట్విస్ట్ బయటపడుతుంది. అసలు ఇంతకీ.. ఆ ట్విస్ట్ ఏంటి..? ఆ గొడవలన్నింటి నుంచీ సందీప్ బయటపడ్డాడా? ఈ సినిమాలో వరలక్ష్మి రోల్ ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: అసలు ఈ సినిమాను డైరెక్టర్.. ఏ వ్యూహంతో తీశాడో అర్థం కాలేదు. ఈ సినిమాలో కామెడీ కంటే.. సాగతీతలే ఎక్కువగా ఉన్నాయి. అలాగని.. సస్పెన్స్‌లు కూడా ఏమీ లేవు. అక్కడక్కడ హాస్య సన్నివేశాలు ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం అవి కనెక్ట్ కాలేదు. చాలా సాదాసీదా సినిమా అనే చెప్పవచ్చు. తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ టైటిల్‌కు తగినట్టుగా ఈ మూవీ ఉందా..! అన్నది సందేహమే.

నటీనటులు: సందీప్‌ కిషన్ సాధారణంగానే.. తన పాత్రకు న్యాయం చేసి.. ఎమోషన్స్‌ని పండించాడు. అయితే.. కామెడీ టైమింగ్ మాత్రం సందీప్‌కి అస్సలు సూటవ్వలేదు. క్లైమాక్స్‌కి ముందు సందీప్ 20 నిమిషాల వరకూ స్క్రీన్‌పై కనిపించడు. అలాగే.. హన్సిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం అందంగా కనిపించింది. అసలు ఆమె పాత్ర.. సినిమాకి అనవసరం అనిపించింది. ఇక వరలక్ష్మీ పాత్రకి ఏదో బిల్డప్‌ ఇచ్చినట్టు చూపించినా.. చాలా సాదా సీదాగా ఉంది. ఆమెకిచ్చిన రోల్‌లో సీరియస్ నెస్ లేదు. ఇక వెన్నెల కిషోర్.. అన్నపూర్ణమ్మ, వై విజియ, రఘబాబు, సప్తగిరి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:

కొన్ని కామెడీ సీన్స్ సెకండ్‌ ఆఫ్

మైనస్ పాయింట్స్:

కథ స్క్రీన్ ప్లే కథలో కరువైన సీరియస్ నెస్ అనవసర పాత్రలు