AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ సమ్మె.. అక్కడ మద్దతు.. రంగంలోకి ఏపీఎస్ ఆర్టీసీ కూడా !

తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ నేతలు సీఎం కేసీఆర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిపోలవద్ద ధర్నాలు చేపట్టారు. సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం కేసీఆర్ తమ మొండి వైఖరిని మానుకుని కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కోరారు. అదే విధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ […]

ఇక్కడ సమ్మె.. అక్కడ మద్దతు.. రంగంలోకి ఏపీఎస్ ఆర్టీసీ కూడా !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 13, 2019 | 11:56 AM

Share

తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ నేతలు సీఎం కేసీఆర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిపోలవద్ద ధర్నాలు చేపట్టారు. సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం కేసీఆర్ తమ మొండి వైఖరిని మానుకుని కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కోరారు. అదే విధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలు ధరించి సమ్మెకు సంఘీభావం తెలుపుతూ విధులకు హాజరవుతామని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు వెల్లడించారు.

ఇదిలా ఉంటే టీఎస్ఆర్టీసీ యూనియన్లు తమ సంస్ధను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో కూడా ఇదే డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగింది. కార్మికులు చేస్తున్న సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టు దిగడం లేదు. కార్మికుల చేస్తున్న ప్రధాన డిమాండ్‌ పరిష్కారం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో విలీనం చేయగా లేనిది ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సమ్మెకు దిగిన 48 వేలమంది కార్మికుల్లో ఏ ఒక్కరినీ తాము తొలగించలేదని, వారికి వారే స్వచ్ఛందంగాఉద్యోగాన్నివదులుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. మరో మూడు రోజుల్లో వందశాతం బస్సులు రోడ్డెక్కుతాయని కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తాత్కాలికంగా కొన్ని బస్సులు నడుపుతున్నారు. మరోవైపు సమ్మెపై హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్