వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్: ఫైనల్‌కు చేరిన భారత యువకెరటం..!
భారత యువ బాక్సర్ మంజురాణి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్‌షిప్స్ 48 కేజీల విభాగంలో ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జ మెమొరియల్ బాక్సింగ్ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత మరో బాక్సర్ […]
భారత యువ బాక్సర్ మంజురాణి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్‌షిప్స్ 48 కేజీల విభాగంలో ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జ మెమొరియల్ బాక్సింగ్ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
భారత మరో బాక్సర్ జమునా బోరో ప్రపంచ ఛాంపియన్స్‌షిప్స్ 54 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5తేడాతో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ కూడా సెమీస్‌లో ఓడిన సంగతి తెలిసిందే. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ చేతిలో 1-4 తేడాతో ఓడి కాంస్యం పతకాన్ని అందుకుంది.