కింగ్స్ XI పంజాబ్ నూతన కోచ్‌గా అనిల్‌కుంబ్లే
ఐపీఎల్ 2020 సీజన్‌లో పాల్గొనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని నియమించారు. విండీస్ దిగ్గజ మాజీ బౌలర్ కొట్నీ వాల్స్ కు ప్రతిభాన్వేషణ బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురే కాకుండా ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్‌గా జార్జి బెయిలీ […]
ఐపీఎల్ 2020 సీజన్‌లో పాల్గొనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని నియమించారు. విండీస్ దిగ్గజ మాజీ బౌలర్ కొట్నీ వాల్స్ కు ప్రతిభాన్వేషణ బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురే కాకుండా ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్‌గా జార్జి బెయిలీ (ఆ్రస్టేలియా)లను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైంది.
2016, 2017లలో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించిన 48 ఏళ్ల కుంబ్లే వచ్చే ఐపీఎల్‌లో ఏకైక స్వదేశీ హెడ్ కోచ్‌గా ఉండబోతున్నాడు. మిగతా ఫ్రాంచైజీ జట్లకు విదేశీ క్రికెటర్లే కోచ్‌లుగా ఉన్నారు. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోని ఆ జట్టుని కుంబ్లే ముందుకు తీసుకెళ్తాడని కింగ్స్ XI జట్టు యాజమాన్యం భావిస్తోంది. డిసెంబర్ 19న నిర్వహించే ఐపీఎల్ వేలంలో కుంబ్లే పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడని వాడియా పేర్కొన్నారు. 2014లో ఫైనల్ చేరిన పంజాబ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన విషయం విదితమే.