ఆస్తి కోసం భర్తను చంపి.. జైలులో జ్యోతిష్కురాలుగా..

మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తనయుడు రోహిత్ హత్య కేసులో అతని భార్య అపూర్వ శుక్లా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆస్తి కోసం భర్తను చంపి.. జైలు శిక్ష అనుభవిస్తున్న అపూర్వ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను చేసిన నేరం పట్ల ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడంలేదని జైలు సిబ్బంది చెబుతున్నారు. పైగా ఆమె ప్రస్తుతం జాతకాలు చెప్పడం నేర్చుకుంటుందన్నారు. జైలులో వారానికి రెండుసార్లు మంగళవారం, గురువారం రోజుకు రెండు గంటలపాటు […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:53 am, Tue, 16 July 19
ఆస్తి కోసం భర్తను చంపి.. జైలులో జ్యోతిష్కురాలుగా..

మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తనయుడు రోహిత్ హత్య కేసులో అతని భార్య అపూర్వ శుక్లా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆస్తి కోసం భర్తను చంపి.. జైలు శిక్ష అనుభవిస్తున్న అపూర్వ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను చేసిన నేరం పట్ల ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడంలేదని జైలు సిబ్బంది చెబుతున్నారు. పైగా ఆమె ప్రస్తుతం జాతకాలు చెప్పడం నేర్చుకుంటుందన్నారు. జైలులో వారానికి రెండుసార్లు మంగళవారం, గురువారం రోజుకు రెండు గంటలపాటు జాతకాల గురించి క్లాసులు జరుగుతాయని తెలిపారు అధికారులు. అపూర్వ ఈ కోర్సును నేర్చుకుంటోందని జైలు సిబ్బంది తెలిపారు. అంతేకాదు ఈ కోర్సు పట్ల ప్రత్యక శ్రద్ధ చూపుతోందని ప్రశంసిస్తున్నారు. గతంలో కోర్టు విచారణ సందర్భంగా ఓ క్లాస్ మిస్సయిందని.. అందుకు ఆమె బాధ పడిందని అధికారులు వెల్లడించారు.