AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @10AM

1.రాహుల్ రాజీనామాకు 50 రోజులు.. వారసులెవరో తేల్చని పార్టీ.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేసి.. నిన్నటికి 50 రోజులు గడిచిపోయాయి. రోజులు గడుస్తున్నా కొత్త లీడర్ ఎంపికపై నిర్లక్ష్యం చేయడంతో పార్టీకి షాక్‌లు ఎదురవుతున్నాయి…Read More    2. కడపలో మరో ముగ్గురు డీఎస్పీల బదిలీలు..! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచీ.. ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు ఊపందుకున్నాయి..Read More   3. నేడు శ్రీకాళహస్తి […]

టాప్ 10 న్యూస్ @10AM
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2019 | 10:00 AM

Share

1.రాహుల్ రాజీనామాకు 50 రోజులు.. వారసులెవరో తేల్చని పార్టీ..

కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేసి.. నిన్నటికి 50 రోజులు గడిచిపోయాయి. రోజులు గడుస్తున్నా కొత్త లీడర్ ఎంపికపై నిర్లక్ష్యం చేయడంతో పార్టీకి షాక్‌లు ఎదురవుతున్నాయి…Read More   

2. కడపలో మరో ముగ్గురు డీఎస్పీల బదిలీలు..!

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచీ.. ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు ఊపందుకున్నాయి..Read More  

3. నేడు శ్రీకాళహస్తి తప్ప.. మిగతా ఆలయాలు మూసివేత..!

ఇవాళ అర్థరాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు యూతపడనున్నాయి. అర్థరాత్రి ఒంటిగంటన్నరకు మొదలైన గ్రహణం.. తెల్లవారుజామున నాలుగున్నరకు విడువనున్న తరుణంలో పదిగంటలపాటు ఆలయాలు మూతపడనున్నాయి..Read More   

4. జస్టిస్‌ సిక్రీకి అంతర్జాతీయ న్యాయమూర్తిగా అరుదైన గౌరవం

ఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అర్జన్‌ కుమార్‌ సిక్రీకి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌ అంతర్జాతీయ కమర్షియల్‌ కోర్టు(ఎస్ఐసీసీ) న్యాయమూర్తిగా సోమవారం సిక్రీ నియమితులయ్యారు..Read More    

5.వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్: ఇంకా మైండ్‌ను విడవట్లా- మహేశ్

ప్రపంచ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా..భవిష్యత్‌లో ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా? అన్న సదేహం కలిగేలా.. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కివీస్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఎక్కడా పట్టు విడవలేదు…Read More 

6.హైదరాబాద్ జూపార్క్‌లో దొంగలు.. గంధపు చెట్లు మాయం..!

హైదరాబాద్ జూపార్క్‌లో ఆదివారం అర్థరాత్రి దొంగలు చొరబడ్డారు. జూపార్కులోని గంధపు చెట్లను నరికి తీసుకెళ్లారు. జూ అధికారులు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు…Read More 

7. అసలు గురుపౌర్ణమి ఎలా వచ్చింది..?

అసలు గురుపౌర్ణమిని ఈరోజు ఎందుకు జరుకుంటారు అంటే పురాణాల ప్రకారంగా వేద వ్యాసుడిని కురుపాండవ వంశాలు గురువుగా కొలిచాయి…Read More

8. పీపీఏ రద్దుపై చంద్రబాబు ఆగ్రహం

గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని భావిస్తోంది…Read More  

9. గురువారమే బలపరీక్ష

కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదిరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు…Read More 

10. నా మనసు కివీస్ పోరాటానికి దాసోహం అయ్యింది- యూవీ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ పరిణామాల మధ్య సాగిందో అందరికి తెలిసిన విషయమే. స్కోర్లు టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై కావడంతో..Read More