జస్టిస్‌ సిక్రీకి అంతర్జాతీయ న్యాయమూర్తిగా అరుదైన గౌరవం

ఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అర్జన్‌ కుమార్‌ సిక్రీకి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌ అంతర్జాతీయ కమర్షియల్‌ కోర్టు(ఎస్ఐసీసీ) న్యాయమూర్తిగా సోమవారం సిక్రీ నియమితులయ్యారు. ఆయన ఆగస్టు 1 నుంచి ఆయన అంతర్జాతీయ న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. 2021 జనవరి 4 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2012 నుంచి 2013వరకు ఈయన పంజాబ్‌, హరియాణ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. తర్వాత 2013 నుంచి 2019 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. […]

జస్టిస్‌ సిక్రీకి అంతర్జాతీయ న్యాయమూర్తిగా అరుదైన గౌరవం
Follow us

|

Updated on: Jul 16, 2019 | 6:52 AM

ఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అర్జన్‌ కుమార్‌ సిక్రీకి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌ అంతర్జాతీయ కమర్షియల్‌ కోర్టు(ఎస్ఐసీసీ) న్యాయమూర్తిగా సోమవారం సిక్రీ నియమితులయ్యారు. ఆయన ఆగస్టు 1 నుంచి ఆయన అంతర్జాతీయ న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. 2021 జనవరి 4 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

2012 నుంచి 2013వరకు ఈయన పంజాబ్‌, హరియాణ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. తర్వాత 2013 నుంచి 2019 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 మార్చిలో ఆయన పదవీ విరమణ పొందారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీలో సభ్యులుగా ఉన్నారు. ఇంటర్నేషనల్‌ లా అసోసియేషన్‌(భారత విభాగం)కు సెక్రటరీగా ఉన్నారు. కాగా ఇటీవలే ఆయన న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్స్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.