మధ్యాహ్నం భోజన పథకంలో భారీ మార్పులు..కొత్త మెనూ చూశారా..?

సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ వెనకడుకు వెయ్యడం లేదు. జవనరి 9న నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకానికి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఇక త్వరలోనే పాఠశాలలో అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 21 వ తేదీ నుంచి ఆహార పదార్థాల్లో క్వాలిటీ పెంచడంతో పాటు, రకరకాలు వెరైటీలను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.353 కోట్ల అదనపు భారం పడనుందని […]

మధ్యాహ్నం భోజన పథకంలో భారీ మార్పులు..కొత్త మెనూ చూశారా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 10, 2020 | 3:21 PM

సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ వెనకడుకు వెయ్యడం లేదు. జవనరి 9న నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకానికి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఇక త్వరలోనే పాఠశాలలో అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 21 వ తేదీ నుంచి ఆహార పదార్థాల్లో క్వాలిటీ పెంచడంతో పాటు, రకరకాలు వెరైటీలను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.353 కోట్ల అదనపు భారం పడనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సోమవారం: అన్నం, పప్పుచారు, గుడ్డు కూర, ఏదైనా స్వీట్..

మంగళవారం: టమాట పప్పు, పులిహోర, బాయిల్డ్ ఎగ్

బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, ఏదైనా స్వీట్

గురువారం: బాయిల్డ్ ఎగ్, కిచిడీ, టమాట చట్నీ

శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, ఏదైనా స్వీట్

శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్

కాగా తాజా మెనూ ప్రకారం వారంలో ఐదు రోజులుపాటు ఎగ్ అందించనున్నారు. పిల్లల చదువు గురించే కాదు తినే ఆహారం గురించి కూడా ఆలోచించిన ఏకైక వ్యక్తి బహుశా జగనే అవుతారని ‘అమ్మఒడి’ కార్యక్రమంలో  ఏపీ ముఖ్యమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు.