ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. పంట మద్దతు ధరలు ఫిక్స్
ఏపీ గవర్నమెంట్.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్‌లోని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు నష్టాలు వాటిల్లకుండా, ఫిక్స్ చేసిన మద్దతు ధర ప్రకారమే కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం తెలిపింది. మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటలు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేవని, కానీ ఆయా పంటలను పండించే రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. వారికి కనీస గిట్టబాటు […]
ఏపీ గవర్నమెంట్.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్‌లోని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు నష్టాలు వాటిల్లకుండా, ఫిక్స్ చేసిన మద్దతు ధర ప్రకారమే కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం తెలిపింది. మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటలు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేవని, కానీ ఆయా పంటలను పండించే రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. వారికి కనీస గిట్టబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కుంది.
“గతంలో మద్దతు ధరలు లేకపోవడం వల్ల రైతులు తరచూ మధ్యవర్తుల దోపిడీ గురించి ఫిర్యాదు చేశారు. అందువల్ల, ఎంఎస్పిని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల రక్షణకు అండగా ఉండనుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఎంఎస్పి కార్యకలాపాల కోసం నిధులు ఖర్చు చేయబడతాయి” అంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై. మధుసూధనరెడ్డి గురువారం(జనవరి9) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం ఫిక్స్ చేసిన పంటల యొక్క మద్దతు ధరలు:
పంట మద్దతు ధర(క్వింటాల్‌కు)
మిర్చి రూ.7,000
పసుపు రూ.6,350
ఉల్లి రూ.770
చిరుధాన్యాలు రూ. 2500( అరికెలు, కొర్రలు, వూదలు, వరిగ, సామలు వంటివి)