అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్..
అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియామించింది ఏపీ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించింది.

అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియామించింది ఏపీ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించింది. అంతర్వేదిలో పరిస్థితి పర్యవేక్షించాలని దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ ఇచ్చింది. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాలని, కొత్త రథం నిర్మాణం సహా పరిస్థితులు కొలిక్కి తీసుకురావాలని దేవదాయ శాఖ సూచించింది. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఆలయ ఇన్‌చార్జి ఈవో NS. చక్రధరరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆలయ సిబ్బందిపైనా చర్యలకు రంగం సిద్ధమైంది.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం ఆదివారం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఘటనపై ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషిస్తోంది. ఒక బృందం ఆలయ సిబ్బంది, అర్చకులను విచారిస్తుండగా, మరో బృందం క్లూస్ సేకరించే పనిలో ఉంది. ఇంకో బృందం గ్రామస్థులను విచారిస్తుండగా, మరో బృందం సీసీ ఫుటేజ్‌లు పరిశీలించే పనిలో ఉంది. ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు, జిల్లా ఎస్పీ నయీంఅస్మీ, ఫోరెన్సిక్ ఐజీ రాజేంద్రససేన్‌ల పర్యవేక్షణలో వివిధ కోణాల్లో విచారణ చేపడుతోంది.




