జగన్ హవా.. బాబు డీలా…

ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ హవా మొదలైంది. ఈ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. అనేక చోట్ల టీడీపీ అభ్యర్ధుల కన్న.. వైసీపీ అభ్యర్ధులదే పైచేయిగా ఉంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఇంకా ఖాతా తెరవలేదు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి, హిందూపురంలో గోరంట్ల మాధవ్ ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్ధి పూసపాటి అశోక్ గజపతి రాజుపై […]

జగన్ హవా.. బాబు డీలా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 23, 2019 | 12:09 PM

ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ హవా మొదలైంది. ఈ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. అనేక చోట్ల టీడీపీ అభ్యర్ధుల కన్న.. వైసీపీ అభ్యర్ధులదే పైచేయిగా ఉంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఇంకా ఖాతా తెరవలేదు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి, హిందూపురంలో గోరంట్ల మాధవ్ ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరంలో టీడీపీ అభ్యర్ధి పూసపాటి అశోక్ గజపతి రాజుపై వైసీపీ అభ్యర్ధి బెలాన చంద్రశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ 146 స్థానాల్లో టీడీపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కడప జిల్లా పులివెందులలో జగన్ ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నట్లు మొదట వార్తలు వచ్చినప్పటికీ.. తరువాత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలోనూ, గాజువాక లోనూ వెనుకంజలో ఉన్నారు. భీమవరంలో ఆయన సమీప వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 625 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నగరిలో రోజా హవా కొనసాగుతుండగా… సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తన సమీప అభ్యర్ధి కోడెల శివప్రసాద్‌పై ఆధిక్యంలో ఉన్నారు.

తొలి రౌండ్ కౌంటింగ్‌లో మంత్రులు సొమిరెడ్డి, అచ్చన్నాయుడు, నారాయణ వెనుకంజలో ఉన్నారు. అనకాపల్లి, ఏలూరు, కర్నూల్, అనంతపురం, హిందూపురం, కడప వంటి పలు నియోజకవర్గాల్లో ఫ్యాన్ హవా కొనసాగుతోంది.

అనంతపురంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై వైసీపీ అభ్యర్ధి ప్రకాశ్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.