విశాఖ కాపులుప్పాడ భూముల పంపకంపై హైకోర్టు స్టేటస్‌కో
విశాఖ కాపులుప్పాడ భూముల విషయంలో ఏపీ సర్కారుకి చుక్కెదురైంది. కాపులుప్పాడలో ఉన్న ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీచేసింది. విశాఖ కాపులుప్పాడ లో 20 ఎకరాలు పేదలకు ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని జగన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలకు దీంతో అడ్డుకట్టపడింది. ఈ భూమి అంతా బౌద్ధుని స్తూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని కొత్తపల్లి వెంకట రమణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో […]
విశాఖ కాపులుప్పాడ భూముల విషయంలో ఏపీ సర్కారుకి చుక్కెదురైంది. కాపులుప్పాడలో ఉన్న ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీచేసింది. విశాఖ కాపులుప్పాడ లో 20 ఎకరాలు పేదలకు ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని జగన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలకు దీంతో అడ్డుకట్టపడింది. ఈ భూమి అంతా బౌద్ధుని స్తూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని కొత్తపల్లి వెంకట రమణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ పురావస్తు చట్టం, పర్యావరణ చట్టంలోని నిబంధనలకి వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.