ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు మ‌రో షాక్…

ఏపీ హైకోర్టు జ‌గ‌న్ స‌ర్కార్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. ఇటీవ‌ల పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు మీడియం ఖ‌చ్చితం చేస్తూ స‌ర్కార్ తీసుకొచ్చిన జీవోల‌ను కోర్టు కొట్టేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఏపీలోని పంచాయ‌తీ ఆఫీసుల‌కు వేసిన రంగుల్ని తొల‌గించ‌డానికి స‌ర్కార్ మూడు నెల‌ల గడువు కోర‌డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ‌డ‌పు ఇచ్చే ఉద్దేశం లేద‌ని తేల్చి చెప్పింది. మూడు నెల‌లు గ‌డువు ఇస్తాం స‌రే..అప్ప‌టివ‌ర‌కు లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ పెట్ట‌కుండా […]

ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు మ‌రో షాక్...
Follow us

|

Updated on: Apr 17, 2020 | 7:52 AM

ఏపీ హైకోర్టు జ‌గ‌న్ స‌ర్కార్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. ఇటీవ‌ల పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు మీడియం ఖ‌చ్చితం చేస్తూ స‌ర్కార్ తీసుకొచ్చిన జీవోల‌ను కోర్టు కొట్టేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఏపీలోని పంచాయ‌తీ ఆఫీసుల‌కు వేసిన రంగుల్ని తొల‌గించ‌డానికి స‌ర్కార్ మూడు నెల‌ల గడువు కోర‌డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ‌డ‌పు ఇచ్చే ఉద్దేశం లేద‌ని తేల్చి చెప్పింది. మూడు నెల‌లు గ‌డువు ఇస్తాం స‌రే..అప్ప‌టివ‌ర‌కు లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ పెట్ట‌కుండా ఉంటారా అని ప్ర‌శ్నించింది. స్థానిక ఎన్నిక‌లు పూర్త‌య్యేవ‌ర‌కు రంగులు ఉంచాల‌న్న కార‌ణంతో స‌మ‌యం కోరుతున్న‌ట్లుగా ఉంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా గ‌తంలో పంచాయ‌తీ ఆఫీసులు వేసిన రంగుల్ని వెంట‌నే తొల‌గించాల‌ని హైకోర్టు జ‌డ్జిమెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆ తీర్పును అమ‌లు చేసేందుకు 3 నెల‌ల స‌మ‌యం కావాల‌ని స‌ర్కార్ కోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై విచారణ జ‌రిపిన కోర్టు..మూడు నెల‌ల గ‌డువు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. దీంతో లాక్‌డౌన్ ముగిశాక కొత్త రంగులేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారుల నుంచి సమాచారం తీసుకోని కోర్టుకు వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌భుత్వ లాయ‌ర్ తెలిపారు. త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వ త‌రుపు లాయ‌ర్ కోర‌గా..కోర్టు అందుకు అంగీక‌రించింది.