ఏపీ విద్యాశాఖ మరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై బిట్ పేపర్ లేనట్టే

రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలకు తెరతీస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి ప్రశ్నా పత్రంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న విధానానికి పూర్తి భిన్నంగా బిట్ పేపర్‌ను తొలగించాలని నిర్ణయించింది ఏపీ విద్యాశాఖ. దీన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడతూ ఈ […]

ఏపీ విద్యాశాఖ మరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై  బిట్ పేపర్ లేనట్టే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 27, 2019 | 1:52 AM

రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలకు తెరతీస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి ప్రశ్నా పత్రంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న విధానానికి పూర్తి భిన్నంగా బిట్ పేపర్‌ను తొలగించాలని నిర్ణయించింది ఏపీ విద్యాశాఖ. దీన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడతూ ఈ విషయాలు వెల్లడించారు. పదవ తరగతి ప్రశ్నాపత్రంలో బిట్ పేపర్ రద్దు చేయడం వల్ల మాస్ కాపీయింగ్ జరిగే అవకాశాలు ఉండవని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే ప్రతికార్యక్రమాన్ని ప్రైవేటు స్కూల్స్‌లో కూడా ఖచ్చితంగా అమలు జరపాలన్నారు.

రాష్ట్రంలో మనబడి మన బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కోసం తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,390 పైగా తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేశామని, వీటిలో చాల వరకు ఏకగ్రీవంగానే ఏర్పాటైనట్టు మంత్రి సురేశ్ వెల్లడించారు. పాఠశాలల్లో విద్యార్ధుల యూనిఫారమ్, సైకిళ్ల పంపిణీతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై అవగాహన కోసం ఈ కమిటీలు కృషి చేస్తాయన్నారు. త్వరలో వీరందరికీ శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు మంత్రి సురేశ్ వివరించారు.