టీవీ9 బిగ్ డిబేట్‌లో రచ్చ రేపిన పీపీఏ.. బీజేపీ నేతకు లైవ్‌లోనే లీగల్ నోటీసు

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, మూడు కంపెనీల ఒప్పందాలపై పున:సమీక్ష చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై గురువారం రాత్రి టీవీ9లో జరిగిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఛానెల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధర్యంలో జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో గత ఏపీ ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహించిన కుటుంబరావు, వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బీజపీ […]

టీవీ9 బిగ్ డిబేట్‌లో  రచ్చ రేపిన పీపీఏ..  బీజేపీ నేతకు లైవ్‌లోనే లీగల్ నోటీసు
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 27, 2019 | 12:58 AM

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, మూడు కంపెనీల ఒప్పందాలపై పున:సమీక్ష చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై గురువారం రాత్రి టీవీ9లో జరిగిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఛానెల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధర్యంలో జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో గత ఏపీ ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహించిన కుటుంబరావు, వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బీజపీ నుంచి ఆపార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే చర్చలో ప్రధాన అంశమైన విద్యుత్ కొనుగోళ్లలో పీపీఏల పున:సమీక్షపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో వేలకోట్ల అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. వీటిలో ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ కుటుంబరావు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీంతో డిబేట్‌లో పాల్గొన్న కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విష్ణువర్ధన్‌రెడ్డి మాటలు సరిగ్గా మాట్లాడాలని, లేనిపోని విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తే తాను లీగల్ నోటీసు ఇస్తానంటూ హెచ్చరించారు. ఆయన అన్నట్టుగా తన వాట్సాప్ నుంచి డిబేట్ కొనసాగుతుండగానే లైవ్‌లో విష్ణువర్ధన్ రెడ్డికి లీగల్ నోటీసుల పంపించారు. రెండు మూడు రోజుల తర్వాత నోటీసులు డైరెక్ట్‌గా వస్తాయని హెచ్చరించారు.

అయితే ఈ లీగల్ నోటీసులపై విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ కుటుంబరావు ప్రతి విషయానికి ఈ విధంగా నోటీసులు పంపడం ఆయనకు అలవాటేనని, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరగకపోతే ఆయన ఎందుకు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబరావు పంపిన నోటీసులు తనను ఏమీ చేయలేవంటూ చెప్పుకొచ్చారు విష్ణువర్దన్‌రెడ్డి. ఇదిలా ఉంటే చర్చ వ్యక్తిగతంగా మారుతుండటంతో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ వీరిద్దరినీ శాంతపరిచారు. మొత్తానికి టీవీ9 బిగ్ డిబేట్‌ కార్యక్రమలో గురువారం రాత్రి పీపీఏలపై జరిగిన చర్చ ఆద్యంతం హాట్‌హాట్‌గా నడిచి లీగల్ నోటీసులు ఇచ్చుకునే వరకు వెళ్లింది.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై మరోసారి సమీక్షకు వెళ్లాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా మూడు కంపెనీలకు సంబంధించి భారీగా అవకతకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈనేపథ్యంలో పీపీఏలపై పున:సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాసిన తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ కూడా రిప్లై లేఖ కూడా రాశారు. ప్రభుత్వం ఈ విధంగా పీపీఏలపై మరోసారి సమీక్షకు వెళ్తే పెట్టుబడి దారుల్లో అపనమ్మకం ఏర్పడుతుందని..ఈ కంపెనీల బలాబలాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని అందువల్ల పున:సమీక్షకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu