అక్కడ అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగితే…

విద్యార్థులంతా క్రమశిక్షణతో మెలిగేందుకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు రకరకాల ఉత్తర్వులు జారీ చేస్తుంటాయి. అయితే ఆ  విశ్వవిద్యాలయంలో అమ్మాయి, అబ్బాయి కలిసి తిరుగుతూ కనిపించకూడదట! ఒకవేళ ఈ నియమాన్ని లెక్కచేయకపోతే వారి తల్లిదండ్రులను పిలిచి భారీ జరిమానా విధిస్తామని ఆ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ చార్‌సద్దాలోని బచా ఖాన్‌ విశ్వవిద్యాలయం కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందేనని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వు ట్విటర్‌లో వైరల్‌గా మారింది. బచాఖాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ చీఫ్‌ ప్రోక్టర్‌ ఫర్మనుల్లాహన్‌ […]

అక్కడ అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగితే...
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 10:25 PM

విద్యార్థులంతా క్రమశిక్షణతో మెలిగేందుకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు రకరకాల ఉత్తర్వులు జారీ చేస్తుంటాయి. అయితే ఆ  విశ్వవిద్యాలయంలో అమ్మాయి, అబ్బాయి కలిసి తిరుగుతూ కనిపించకూడదట! ఒకవేళ ఈ నియమాన్ని లెక్కచేయకపోతే వారి తల్లిదండ్రులను పిలిచి భారీ జరిమానా విధిస్తామని ఆ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ చార్‌సద్దాలోని బచా ఖాన్‌ విశ్వవిద్యాలయం కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందేనని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వు ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

బచాఖాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ చీఫ్‌ ప్రోక్టర్‌ ఫర్మనుల్లాహన్‌ ఈ ఉత్తర్వును విడుదల చేశారు. ”అమ్మాయి-అబ్బాయి కలిసి కళాశాల ప్రాంగణంలో తిరగడం నిషిద్ధం. ఇది మన సంప్రదాయం కూడా కాదు. ఒకవేళ ఈ నిబంధనలను అతిక్రమించి మళ్లీ అమ్మాయి, అబ్బాయి కలిసి జంటగా కళాశాల ప్రాంగణంలో కనిపిస్తే వారిపై చర్యలు ఉంటాయి. ఆ  విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారికి జరిమానా విధిస్తాం.” అని ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే, ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.