రమేష్‌ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

రమేష్‌ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2020 | 7:30 AM

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ ర‌మేష్ ఆస్ప‌త్రిపై చ‌ర్య‌లు తీసుకుంది. గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్‌కు విరుద్దంగా ఆస్ప‌త్రి.. కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు ఐదుగురు సభ్యుల కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది. దీంతో ర‌మేష్ ఆస్ప‌త్రికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజ‌య‌వాడ బంద‌ర్ రోడ్‌లోని డాక్ట‌ర్ ర‌మేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే కరోనా రోగుల చికిత్స కోసం అనుమ‌తి పొందిన‌ట్లు గుర్తించారు.

ఈ కేసు విచార‌ణ‌లో రూల్స్‌కు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్‌ను పెట్టడ‌మే కాకుండా… అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని గుర్తించారు. అలాగే ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశారని రిపోర్టులో నివేదించారు. ఇకపై కోవిడ్ పాజిటివ్ పేషెంట్ల‌ను చేర్చుకోవద్దని రమేష్ ఆస్పత్రిని ఆదేశించారు. ఈ మేర‌కు జారీ చేసిన ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

కాగా ప్ర‌మాదానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ ఓన‌ర్ శ్రీనివాస్‌ బాబుకోసం స్పెష‌ల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.‌

Also Read : విజయమాల్యా జీవితంపై వెబ్​సిరీస్​