రజనీకి ఫోన్ చేసిన అజిత్‌.. ఎందుకంటే

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి తల అజిత్‌ కాల్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఇద్దరి అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్‌ చేస్తున్నారు

రజనీకి ఫోన్ చేసిన అజిత్‌.. ఎందుకంటే
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 7:35 AM

Ajith call to Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి తల అజిత్‌ కాల్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఇద్దరి అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్‌ చేస్తున్నారు. అయితే ఉన్నట్లుండి రజనీకి అజిత్‌ ఎందుకు కాల్ చేశారు. వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటే. నటుడిగా రజనీకాంత్‌ ఇటీవల 45ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజిత్‌, రజనీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట. అంతేకాదు దాదాపు అరగంటకు పైగా ఈ ఇద్దరు పలు విషయాలపై చర్చించుకుంటున్నారట. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా అజిత్‌ ప్రస్తుతం హెచ్‌.వినోద్ దర్శకత్వంలో వలిమై చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్‌, శివ దర్శకత్వంలో అన్నాత్తేలో కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

కేంద్ర నిధులను బాబు సర్కార్ తప్పుదోవ పట్టించింది

ఏపీఎస్‌ఆర్టీసీలో నగదు రహిత టికెట్లు.. ఈ నెలాఖరున టెండర్లు