ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ దొరికేనా..?

సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ ముగిసింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేగాక.. ఐపీఎస్‌ల బదిలీలపై కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం. అలాగే.. ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందుకోసం గౌతమ్ సవాంగ్ ఓ అధ్యయన కమిటీని నియమించినట్టు తెలిపారు. ఈ కమిటీకి 21 మంది పోలీసు అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. వీక్లీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:30 pm, Wed, 5 June 19
ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ దొరికేనా..?

సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ ముగిసింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేగాక.. ఐపీఎస్‌ల బదిలీలపై కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం. అలాగే.. ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందుకోసం గౌతమ్ సవాంగ్ ఓ అధ్యయన కమిటీని నియమించినట్టు తెలిపారు. ఈ కమిటీకి 21 మంది పోలీసు అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. వీక్లీ ఆఫ్ అమలుపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.