AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 199 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689కి చేరింది.

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 199 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
AP-Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2021 | 6:36 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689కి చేరింది. కొత్తగా రాష్ట్రంలో ఒకరిని కరోనా బలి తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ శనివారం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్‌లో తెలిపింది.  దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,128 మంది కొవిడ్‌ కారణంగా మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 423 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,74,954కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,607 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,22,74,647 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Also Read : 

Nellore Tragedy: లవ్ మ్యారేజ్ చేసుకున్న 2 నెలలకు భర్త మరణం.. తాజాగా భార్య మృతి, అంతా మిస్టరీ !

Bird Flu in India: మెదక్‌లో బర్డ్ ఫ్లూ కలవరం.. ఐదు నెమళ్లు మృత్యువాత.. స్థానికుల్లో టెన్షన్, టెన్షన్

COVID Vaccine: గుడ్ న్యూస్.. దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ