Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

భారత -ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్న సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా క్రికెటర్లకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఆసీస్‌ అభిమానులు చెలరేగిపోయారు. ఫీల్డింగ్‌లో ఉన్న...

Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 09, 2021 | 6:38 PM

Racial Abuse : భారత – ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్న సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా క్రికెటర్లకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఆసీస్‌ అభిమానులు చెలరేగిపోయారు. ఫీల్డింగ్‌లో ఉన్న భారత ఆటగాళ్లను టార్గెట్ చేశారు. బౌండరీలో ఉన్న  మహ్మద్‌ సిరాజ్‌, బుమ్రాను బండబూతులు తిట్టారు.

సిడ్నీ క్రికెట్‌గ్రౌండ్‌ ఇలా రేసిజంకు వేదికగా మారింది. ఈ ఘటనపై బీసీసీఐ(BCCI) అంతర్జాతీయ క్రికెట్‌ సంఘం(ICC) కి ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ జాత్యాంహకార కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సిరాజ్‌,బుమ్రాతో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లపై కూడా జాత్యాంహకార కామెంట్స్‌ చేశారు. ఈ ఘటనపై టీమిండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిడ్నీ టెస్ట్‌ రెండో రోజు ఈ ఘటన చోటు చేసుకుంది.

13 ఏళ్ల క్రితం.. ఇదే మైదానంలో ఆసీస్​-భారత్ మధ్య జరిగిన సిరీస్​లోనూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో భారత జట్టు మాజీ ఆటగాడు హర్భజన్​ సింగ్​.. తనను కోతి అంటూ హేళన చేశాడని ఆసీస్​ మాజీ క్రికెటర్​ సైమండ్స్ ఆరోపించాడు​. ఈ వివాదం కారణంగా భజ్జీ నిషేధానికి కూడా గురయ్యాడు.