Nellore Tragedy: లవ్ మ్యారేజ్ చేసుకున్న 2 నెలలకు భర్త మరణం.. తాజాగా భార్య మృతి, అంతా మిస్టరీ !
వారిద్దరూ పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్నో కలలతో దాంపత్యం జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ వారు ఒకలాగా తలిస్తే.. విధి మరోలా తలిచింది.
Nellore Tragedy: వారిద్దరూ పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్నో కలలతో దాంపత్యం జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ వారు ఒకలాగా తలిస్తే.. విధి మరోలా తలిచింది. వివాహం చేసుకున్న మూడు నెలల్లోనే ఆ దంపతులు ఇద్దరు ఒకరి వెంట ఒకరు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… రాపూరు మండలం మట్టిపల్లికి చెందిన శిరీష జిల్లా గవర్నమెంట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. గతేడాది అక్టోబరులో పెద్దల్ని ఎదురించి జగదీష్ అనే యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. నెల్లూరులో ఉంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే అనూహ్యంగా డిసెంబరు 7న జగదీష్ హార్ట్ అటాక్‌తో కన్నుమూశాడు. పెళ్లైన రెండు నెలలకే భర్త చనిపోవడంతో శిరీష తీవ్ర విషాదంలో ఉంది.
అయితే భర్త లేడనే విషయాన్ని శిరీష జీర్ణించుకోలేక పోయింది. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. గురువారం తనకు కళ్లు తిరుగుతున్నాయంటూ ఫ్రెండుగా చెప్పగా.. ఆమె హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. దారిలోకి శిరీష అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అక్కడికి చేరుకునే సమయానికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె చేతికి ఇంజెక్షన్ వేసుకున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆమె సూసైడ్ చేసుకున్నారా.. అనారోగ్యంతో చనిపోయారా అనేది విచారిస్తున్నారు పోలీసులు. మూడు నెలల గ్యాప్‌లో భార్యాభర్తలు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది.
Also Read :
Bird Flu in India: మెదక్‌లో బర్డ్ ఫ్లూ కలవరం.. ఐదు నెమళ్లు మృత్యువాత.. స్థానికుల్లో టెన్షన్, టెన్షన్
COVID Vaccine: గుడ్ న్యూస్.. దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ