జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..
లాక్ డౌన్ కారణంగా మూతపడిన డిగ్రీ కాలేజీలను అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా రాష్ట్రంలోని ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
Colleges In AP From October 15: లాక్ డౌన్ కారణంగా మూతపడిన డిగ్రీ కాలేజీలను అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా రాష్ట్రంలోని ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 80 శాతానికి తీసుకెళ్లాలని చెప్పిన సీఎం.. సెప్టెంబర్‌లో సెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించారు.
అలాగే మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్‌షిప్, మరో ఏడాది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఉపాధి కల్పించే కోర్సులు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం.. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read:
గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్’.. కేవలం రూ. 35కే..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!
ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..!
జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!