వాలంటీర్లకు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు చప్పట్లు కొట్టి తన సంఘీభావం ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధాని అమరావతిలోని క్యాంప్ కార్యాలయం ముందు నిలబడి ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి జగన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు చప్పట్లు కొట్టి తన సంఘీభావం ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధాని అమరావతిలోని క్యాంప్ కార్యాలయం ముందు నిలబడి ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి జగన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, సీఎం జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
జగన్ సర్కారు భారీ ఎత్తున చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో వాలంటీర్లు విశేషంగా తమ సేవలందిస్తూ ప్రజలకు అత్యంత అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాల్ని ప్రజల దగ్గరకు చేరుస్తున్నారు. జగన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వర్గాలు ఈ చప్పట్ల కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు మద్దతు ప్రకటించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు, అనేక మంది పార్టీ కార్యకర్తలు కూడా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలిపారు.
Braving through harsh weather conditions & a pandemic that shook the world, our Grama Sachivalayam functionaries have been at the frontline, ensuring last-mile delivery of services. My heartfelt gratitude to each & everyone of you for being the extended arms of our govt. pic.twitter.com/QarjchhQEi
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2020