అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి సీరియస్ డిస్కషన్..వీరి భేటీలో ఆ అంశంపైనే గంట పాటు చర్చ
కేంద్ర మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ కలిశారు. వరద సాయం, వ్యవసాయ చట్టాలు, పోలవరం నిధులపై వీరి భేటీలో గంట పాటు చర్చించారు. అంతేకాదు పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ కలిశారు. వరద సాయం, వ్యవసాయ చట్టాలు, పోలవరం నిధులపై వీరి భేటీలో గంట పాటు చర్చించారు. అంతేకాదు పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను అమోదించేలా సహకరించాలని వినతించారు. కాగా సీఎం ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయాంశాలే అత్యధికంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని బీజేపీ తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సదస్సులు విజయవంతం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. జగన్, అమిత్ షా భేటీలో ఈ సందస్సుల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.