ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట శ్రీవారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు సీఎం చేరుకుని ఆలయ మహాద్వారం ద్వారా జగన్ ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఆలయ అర్చకులు సీఎం జగన్ కు పరివట్టం చుట్టారు. తర్వాత పట్టు వస్త్రాలను ఉంచిన వెండి పళ్లాన్ని తలపై పెట్టుకున్నారు. గతంలో సీఎం హోదాలో వైయస్ఆర్ […]

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట శ్రీవారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు సీఎం చేరుకుని ఆలయ మహాద్వారం ద్వారా జగన్ ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఆలయ అర్చకులు సీఎం జగన్ కు పరివట్టం చుట్టారు. తర్వాత పట్టు వస్త్రాలను ఉంచిన వెండి పళ్లాన్ని తలపై పెట్టుకున్నారు. గతంలో సీఎం హోదాలో వైయస్ఆర్ అనేక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకులు సీఎం జగన్ కు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.
తిరుమలకు ఈరోజు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు బ్రహ్మాండనాయకుడి వేడుకను కనులారా తిలకిస్తున్నారు. మాఢవీధులన్నీ గోవిందుని నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి సీఎం జగన్ తిరుమలలోనే బస చేయనున్నారు. కాగా మంగళవారం ఆయన విజయవాడకు బయలుదేరే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుమల ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.