కొత్త లుక్స్‌తో సూపర్‌గా ఏపీ సీఎం..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. ఫ్యామిలీతో అమెరికా టూర్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చేందుకు అమెరికాలోని వివిధ అధికారులతో సమావేశమవుతున్నారు. కాగా.. అమెరికాకు వెళ్లిన సీఎం జగన్‌ను కలిసేందుకు తెలుగు అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్నారు. కాగా.. ఆయన ఏపీ పెట్టుబడుల అంశంపై చర్చించేందుకు భారత రాయబార కార్యలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా, నీల్‌కాత్ అవ్మద్‌లు జగన్‌ను కలిసి ఘనంగా స్వాగతం […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:58 am, Sat, 17 August 19
కొత్త లుక్స్‌తో సూపర్‌గా ఏపీ సీఎం..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. ఫ్యామిలీతో అమెరికా టూర్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చేందుకు అమెరికాలోని వివిధ అధికారులతో సమావేశమవుతున్నారు. కాగా.. అమెరికాకు వెళ్లిన సీఎం జగన్‌ను కలిసేందుకు తెలుగు అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్నారు.

కాగా.. ఆయన ఏపీ పెట్టుబడుల అంశంపై చర్చించేందుకు భారత రాయబార కార్యలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా, నీల్‌కాత్ అవ్మద్‌లు జగన్‌ను కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం.. మరో భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా జగన్‌ను విందుకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు జగన్ భార్య భారతితో విందుకు హాజరయ్యారు. అలాగే.. జగన్ వాషింగ్టన్‌లో ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి హాజరయ్యారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో కూడా జగన్ పాల్గొని, ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం.. కొత్త లుక్స్‌తో అదుర్స్ అనిపించారు. బిజిమ్యాన్‌ గెటప్‌లో.. బ్లూ కలర్‌ బ్లేజర్‌తో వైట్‌ కలర్ షర్ట్‌తో.. క్రీమ్ కలర్ ప్యాంట్‌తో ఆకట్టుకున్నారు. అలాగే.. దానికి మ్యాచింగ్ షూతో.. నీటిగా.. పక్కా ఫ్రొఫెషనల్‌గా.. హుందాగా వ్యవహరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

AP CM Jagan Mohan Reddy impresses with his New look in America Tour

AP CM Jagan Mohan Reddy impresses with his New look in America Tour