ఏపీ సీఎం సంచలన నిర్ణయం..కర్ణాటకలో పాలాభిషేకం

ఏపీ సీఎం సంచలన నిర్ణయం..కర్ణాటకలో పాలాభిషేకం

బెంగళూరు: నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా..ఆర్ధిక వెసులుబాటు, ప్రజా సంక్షమం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాగా ఏపీ సీఎం తీసుకునే కొన్ని నిర్ణయాలు సెన్సేషన్‌గా మారుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలువురు నేతలు జగన్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ జగన్ ప్రభుత్వ అసెంబ్లీలో బిల్లును […]

Ram Naramaneni

|

Sep 19, 2019 | 5:14 PM

బెంగళూరు: నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా..ఆర్ధిక వెసులుబాటు, ప్రజా సంక్షమం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాగా ఏపీ సీఎం తీసుకునే కొన్ని నిర్ణయాలు సెన్సేషన్‌గా మారుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలువురు నేతలు జగన్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ జగన్ ప్రభుత్వ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసింది.  దీంతో తమిళనాడులో కూడా ఆంధ్రా తరహా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఓ ఉద్యమమే మెుదలైంది. జగన్‌ను పొగుడుతూ ‘ఆంధ్రా తలైవా’ అంటూ కూడా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రతిపాదన  చేసిన నేపథ్యంలో కర్ణాటకలోని ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఉద్యమ బాట పట్టారు.

కర్ణాటక ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని హీరే కరూర్ లోని కేఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆంధ్ర సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన.. తెలంగాణలో సైతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఒత్తిడులు తెస్తున్నారు ఉద్యోగులు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతి తదితర అంశాల అడ్డుకట్ట వేసేందుకు..100 కోట్లు దాటిన  ప్రాజెక్టులన్నీ న్యాయసమీక్ష తర్వాతే టెండ‌ర్ల ద‌శ‌కు వెళ్లాలని ప్ర‌భుత్వం డిసైడ్ చేసింది. దీనికోసం హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకరరావు నియ‌మితులు అయిన‌ట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని ఓ చారిత్రక నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకోవడంతో అది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu