ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. చెరకు ఉత్పత్తి ప్రత్యేక కార్యాచరణపై కసరత్తు
స్థానిక చెరకు రైతుల అవసరమైన వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రుల త్రిసభ్య కమిటి నిర్ణయించింది. వచ్చే సీజన్ నాటికీ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించారు.
స్థానిక చెరకు రైతుల అవసరమైన వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రుల త్రిసభ్య కమిటి నిర్ణయించింది. వచ్చే సీజన్ నాటికీ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా జపాన్ సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు
చెరకు కర్మాగారాల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ అయ్యింది. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, కన్నబాబు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకోసం చేపట్టవలసిన చర్యలపై కమిటి ప్రధానంగా చర్చించింది. ఉత్తరాంధ్రలో చెరకు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు.
చక్కెర కర్మాగారాల సమస్యలు ఆర్థిక, పౌరసరఫరాల శాఖతో కూడా ముడిపడి ఉన్నందున మరో సమావేశం ఏర్పాటు చేయాలని, తరువాత సమావేశానికి ఆయా శాఖల కార్యదర్శులను కూడా పిలవాలని మంత్రులు సూచించారు. గతంలో చక్కెర కర్మాగారాలకు కేటాయించిన భూములు, వాటి విలువపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. పనిచేయని షుగర్ ఫ్యాక్టరీల గత బకాయిలు, విడుదల చేసిన నిధుల వినియోగంపై మంత్రులు ఆరా తీశారు.