ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే..!

ఐదుగురు డిప్యూటీ సీఎంలు తన కేబినెట్‌లో అని ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించిన నేపథ్యంలో ఈ ఐదుగురు ఎవరనే చర్చ మొదలైంది. మరో 24 గంటలకు గడిస్తేగానీ పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ లేదు. కానీ ప్రాంతాల వారీగా, కులాల వారీగా, సీనియారిటీవారిగా పలువురు పేర్లు తెరమీదికొస్తున్నాయి. మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతం కంటే 26 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సీఎంతో కలిపి 26 నెంబర్‌ని మించకూడని పరిస్థితిలో రేపు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:37 pm, Fri, 7 June 19
ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే..!

ఐదుగురు డిప్యూటీ సీఎంలు తన కేబినెట్‌లో అని ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించిన నేపథ్యంలో ఈ ఐదుగురు ఎవరనే చర్చ మొదలైంది. మరో 24 గంటలకు గడిస్తేగానీ పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ లేదు. కానీ ప్రాంతాల వారీగా, కులాల వారీగా, సీనియారిటీవారిగా పలువురు పేర్లు తెరమీదికొస్తున్నాయి. మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతం కంటే 26 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సీఎంతో కలిపి 26 నెంబర్‌ని మించకూడని పరిస్థితిలో రేపు 25 మందితో కేబినెట్ ప్రమాణ స్వీకారం జరగనుంది. వీరిలో 5 గురు డిప్యూటీ సీఎంలు, మిగిలిన వారు కేబినెట్ మంత్రులుగా వ్యవహరించబోతున్నారు.

అయితే.. ఈ క్రమంలో డిప్యూటీల జాబితాను సంపాదించింది టీవీ9. ప్రస్తుత ఖరారైన జాబితా ప్రకారం శ్రీకాకుళం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, ప్రత్తిపాడు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సుచరిత, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి.