నవంబరు 15వ తేదీ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నవంబరు 15వ తేదీ తర్వాత నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

నవంబరు 15వ తేదీ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
Balaraju Goud

|

Oct 29, 2020 | 12:30 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నవంబరు 15వ తేదీ తర్వాత నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నవంబరు 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రిమండలి భేటీ తర్వాతే స్పష్టత రానుంది. మంత్రిమండలి సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను నవంబరు 2వ తేదీలోపు సమర్పించాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, నవంబర్‌లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu