కనిపెంచిన తల్లి బిడ్డలకు భారమైంది.. అమ్మను అడవిలో వదిలేశారు..!
ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవిపక్కన వదిలేశారు. మానవత్వం మంటగలపిన ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
#mother was left forest: ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవిపక్కన వదిలేశారు. మానవత్వం మంటగలపిన ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ఆహారం లేక శరీరం నీరసించి పోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. రోడ్డు పక్కనున్న అచేతనంగా పడిఉన్న ఆ అమ్మను అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించాడు.
నవ మాసాలు మోసి పురిటి నొప్పులకు ఓర్చుకుని చివరకు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లికే ఇప్పుడు కష్టమొచ్చింది. కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లల ఆలనా పాలనా చూస్తుంది అమ్మ. అంతటి గొప్ప మాతృమూర్తిని ఓ కుమారుడు జన సంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన లింగమ్మ (63)ను ఆమె కుమారుడు, కోడలు గురువారం ఆటోలో తీసుకొచ్చి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో జన సంచారం లేని చోట దించేశారు. తిరిగి వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ తల్లి తన కొడుకు వస్తాడని, తీసుకెళతాడని ఆశగా ఎదురుచూస్తోంది. ఎంతసేపటికి కుటుంబసభ్యులు ఎవరూ రాకపోవడంతో తిండి తిప్పలు లేక ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆమెను చూసి వెంటనే సపర్యలు చేసి 108 సిబ్బంది ద్వారా ఆస్పత్రికి తరలించాడు. ఆ తల్లి తేరుకున్నాక, ఆమె గురించి ఆరా తీసిన పోలీసులు అసలు నిజం తెలిసి అవాక్కయ్యారు.
తనను కొడుకు, కోడలు ఇక్కడ వదిలిపెట్టి, మళ్లీ వస్తామని వెళ్లిపోయారని లింగమ్మ చెప్పింది. ఆమె దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన కానిస్టేబుల్ వారు రారని నిర్ధారించుకుని ‘108’కి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి ఆమెకు పూర్తిస్థాయిలో సపర్యలు చేసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండిః