ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ 7,956 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ఇవాళ కాస్త కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ఇవాళ కాస్త కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా సగటున రోజుకు సుమారు 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ సంఖ్య తగ్గిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఒక్కరోజులో 61,529 నమూనాలను పరీక్షించగా 7,956 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరుకుంది. గత కొద్దిరోజులుగా పట్టణాలకు పరిమితమై కరోనా వైరస్ జిల్లాలకు విస్తరించింది. దీంతో కేసుల సంఖ్య గణనీయం పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 93,204 మంది యాక్టివ్ కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 9,764 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక, ఏపీలో 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 60 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురం 7, కర్నూలు 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 4, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, నెల్లూరు 3, గుంటూరులో ఇద్దరు మరణించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,972కి చేరింది.