రెడ్ జోన్లపై ఏపీ ప్ర‌భుత్వం కీలక ప్రకటన..

రెడ్ జోన్లపై ఏపీ ప్ర‌భుత్వం కీలక ప్రకటన..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రెడ్ జోన్లకు సంబంధించి ఏపీ స‌ర్కార్ స్ప‌ష్ట‌త‌ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్ర‌భుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గ్రీన్ జోన్లలో మూడవ ద‌శ లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌నిర్దేశ‌కాల ప్ర‌కారం అనేక స‌డ‌లింపులు ఇచ్చింది. తాజాగా, రెడ్ జోన్లలో నిషేధం విధించిన అంశాలపై గ‌వ‌ర్న‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. రెడ్ జోన్ల‌లో నిషేదం వేటిపైన అంటే…. రెడ్ జోన్‌లోని ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు… […]

Ram Naramaneni

|

May 04, 2020 | 9:31 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రెడ్ జోన్లకు సంబంధించి ఏపీ స‌ర్కార్ స్ప‌ష్ట‌త‌ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్ర‌భుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గ్రీన్ జోన్లలో మూడవ ద‌శ లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌నిర్దేశ‌కాల ప్ర‌కారం అనేక స‌డ‌లింపులు ఇచ్చింది. తాజాగా, రెడ్ జోన్లలో నిషేధం విధించిన అంశాలపై గ‌వ‌ర్న‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.

రెడ్ జోన్ల‌లో నిషేదం వేటిపైన అంటే….

  1. రెడ్ జోన్‌లోని ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు… అలాగే రెడ్ జోన్‌లోని ఇళ్లకు ఎవరూ వెళ్లడానికి వీల్లేదు..
  2. హాట్ స్పాట్ ఏరియాకు ఎవరూ వెళ్లకూడదు.. అలాగే అక్కడికి రావడానికి వీల్లేదు.
  3. మీడియాకు సైతం ఈ ప్రాంతాల్లో ప‌ర్మిష‌న్ లేదు
  4. నిత్యాతవసర సరుకుల షాపులు, మెడికల్ షాపులకు కూడా పర్మిషన్ లేదు
  5. సరైన ధ్రువపత్రాలు లేకుండా అత్య‌వ‌స‌ర అవసరాలకు సైతం ఇళ్లు దాటి బయటకు రావడానికి వీల్లేదు
  6. బ్యాంకులు, ఏటీఎంలు క్లోజ్వా
  7. కింగ్ చేసే పార్కులు, కమ్యూనిటీ ఏరియాలపై సైతం నిషేధం

అతిక్ర‌మిస్తే కఠిన చర్యలు

ఎవరైనా రూల్స్ అతిక్ర‌మిస్తే మొద‌ట హెచ్చ‌రిక చేస్తామ‌ని ఇస్తామని తెలిపింది. మాట విన‌కుండా రెండో సారి కూడా అలాగే వ్యవహరిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897, సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu