ఇస్మార్ట్‌గా మారిన అనసూయ..! మీ తిట్లే నాకు దీవెనలు..!

హాట్ హాట్ పిక్స్‌ పెడుతూ.. అనసూయ ఎప్పుడూ షోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అతి తక్కువ కాలంలో.. బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాకుండా.. వివిధ వివాదాల్లో కూడా.. ఆమె పేరు గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇదివరకే చాలా వివాదాల్లో ఇరుక్కుంది. కొంతమంది నెటిజన్స్.. ఆమె అందాన్ని పొగుడుతూ.. కామెంట్స్ చేస్తే.. మరి కొంతమంది నెటిజన్స్ మాత్రం.. అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉండేవారు. వారితో.. ధీటుగా.. అనసూయ […]

ఇస్మార్ట్‌గా మారిన అనసూయ..!  మీ తిట్లే నాకు దీవెనలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 22, 2019 | 11:03 AM

హాట్ హాట్ పిక్స్‌ పెడుతూ.. అనసూయ ఎప్పుడూ షోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అతి తక్కువ కాలంలో.. బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాకుండా.. వివిధ వివాదాల్లో కూడా.. ఆమె పేరు గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇదివరకే చాలా వివాదాల్లో ఇరుక్కుంది. కొంతమంది నెటిజన్స్.. ఆమె అందాన్ని పొగుడుతూ.. కామెంట్స్ చేస్తే.. మరి కొంతమంది నెటిజన్స్ మాత్రం.. అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉండేవారు. వారితో.. ధీటుగా.. అనసూయ అత్త కూడా.. ఘాటుగానే జవాబు ఇచ్చేది.

అయితే.. ఇప్పుడు రంగమ్మ అత్త తన రూట్ మార్చింది. ఇది వరకు.. ఆమెను కామెంట్స్ చేసిన వారిపై ఒక రేంజ్‌లో విమర్శలు గుప్పించేది. కానీ.. ఇప్పుడు మాత్రం మీ తిట్లే నాకు దీవెనలు అంటూ.. పంచ్ విసిరింది. ఓ ఛానెల్‌‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ట్రోలింగ్స్‌ను ఎదుర్కొనడంలో.. నటి, యాంకర్ అనసూయ రాటు తేలిపోయారు. గతంలో ట్రోల్స్‌కు ఘాటుగా స్పందించే అనసూయ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ట్రోల్స్‌ను దీవెనెలుగా తీసుకుంటున్నట్టు చెప్పింది ఇస్మార్ట్‌ అనసూయ. మరి ఆమె ఓపిక నశించి ఇలా అందో.. లేక ఇప్పటికైనా.. ట్రోల్స్ ఆగుతాయని ఇలా చెప్పిందో.. తెలియదు.

కాగా.. ఇప్పుడు అనసూయ.. ఇటు యాంకరింగ్‌తో పాటుగా అటు.. మూవీస్‌లలో కూడా బిజీగా ఉంటుంది. తాజాగా.. ఆమె మీకుమాత్రమే చెప్తా సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ నిర్మాణంలో దర్శకుడు విజయ్ భాస్కర్ హీరోగా షమీర్ సుల్తాన్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తోంది. ఇందులో.. ఒక హీరోయిన్‌గా లీడ్‌ రోల్లో యాక్ట్ చేసింది. ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది.