AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అఙ్ఞాతం వీడిన కల్కి భగవాన్.. ఐటీ దాడులపై ఏం చెప్పారంటే..!

ఎట్టకేలకు కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు అజ్ఞాతం వీడారు. తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు ఉన్నట్లు కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కల్కి దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు వివరించారు. […]

అఙ్ఞాతం వీడిన కల్కి భగవాన్.. ఐటీ దాడులపై ఏం చెప్పారంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 22, 2019 | 10:54 AM

Share

ఎట్టకేలకు కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు అజ్ఞాతం వీడారు. తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు ఉన్నట్లు కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కల్కి దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు వివరించారు. దాడుల తర్వాత ఇంకా శక్తివంతంగా తయారవుతామని కల్కి భగవాన్ తెలిపారు.

అయితే భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కల్కీ ఆశ్రమంలో ఐటీ శాఖ చేసిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు హైదరాబాద్‌లోనూ కల్కి ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో బంగారు బిస్కట్లు, ఆస్తులు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వెలుగుచూసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Follow Us