జెఎన్‌యు ఘటనపై అమిత్ షా ఆరా

ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీనికి నిరసనగా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌తో మాట్లాడారు. “అవసరమైన చర్యలు” తీసుకోవాలని అధికారికి సూచించినట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. [svt-event date=”06/01/2020,1:37AM” class=”svt-cd-green” ] Union […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:27 am, Mon, 6 January 20
జెఎన్‌యు ఘటనపై అమిత్ షా ఆరా

ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీనికి నిరసనగా పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌తో మాట్లాడారు. “అవసరమైన చర్యలు” తీసుకోవాలని అధికారికి సూచించినట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

[svt-event date=”06/01/2020,1:37AM” class=”svt-cd-green” ]

[/svt-event]

“జెఎన్‌యు హింసపై కేంద్ర హోంమంత్రి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. జాయింట్ సిపి స్థాయి అధికారి దర్యాప్తు జరపాలని మంత్రి ఆదేశించారు. వీలైనంత వరకు నివేదికను వెంటనే సమర్పించాలని కోరారు. “అని హోం మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. విద్యా మంత్రిత్వ శాఖ ఈ దాడిని అత్యంత హేయమైనదిగా పేర్కొంది.

[svt-event date=”06/01/2020,1:38AM” class=”svt-cd-green” ]

[/svt-event]

“ముసుగు వేసుకున్న వ్యక్తుల బృందం ఈ రోజు జెఎన్‌యు క్యాంపస్‌లోకి ప్రవేశించి, రాళ్ళు విసిరి, ఆస్తులను దెబ్బతీసి, విద్యార్థులపై దాడి చేసిందని మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి హింస, అరాచక చర్యలను సహించలేము” అని మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్వీట్టర్ లో పేర్కొంది.

సాయంత్రం 6.30 గంటల సమయంలో గూండాలు క్యాంపస్‌లోకి ప్రవేశించి కర్రలు, రాళ్లతో విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. తలకు గాయమవడంతో జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఐషే ఘోష్‌ను చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు.