AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple For Health: సీజనల్ ఫ్రూట్ అనాస తినడం వలన కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజలు ఎన్నో..

Pineapple For Health: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. ఇది ఎన్నో ప్రత్యేకతలను..

Pineapple For Health: సీజనల్ ఫ్రూట్ అనాస తినడం వలన కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజలు ఎన్నో..
Pineapple Benefits
Surya Kala
|

Updated on: Nov 14, 2021 | 4:50 PM

Share

Pineapple For Health: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. ఇది ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇంగ్లీష్‌లో పైన్‌యాపిల్‌, తెలుగులో అనాస అని పిలుస్తారు. అనాస ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిరిగా ఉంటుంది. పైనాపిల్ తినడానికి పుల్లగా తియ్యగా రుచి కలిగి ఉంటుంది. ఈ పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇక పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి. అదే విధంగా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి.

ఆరోగ్యకరమైన ప్రయోజనాలు:  *అనాసలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి విటమిన్-సి ఎంతగానో దోహదపడుతుంది. *అనాస అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. *మధుమేహం, గుండె పోటు సమస్యలు, దంతాల సమస్యలతో బాధపడేవారు అనాస మంచి ఔషధంగా పనిచేస్తుంది. *విపరీతమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు. *పైనాపిల్ తిన్నవారి చర్మం మృదువుగా ఉంటుందని నిపుణులు చెప్పారు. *పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారంలో సహాయపడుతుంది. *పైనాపిల్ వికారాన్ని తగ్గిస్తుంది * అనాస జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. *ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. *పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. *పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. *జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం దివ్య ఔషధం. *అనాసలో ఉండే బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలలో భాగంగా పైనాపిల్ లోని బీటా-కెరోటిన్‌.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుందని వెల్లడయింది. *బాగా పండిన పైనాపిల్ ను రోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని సంప్రదాయ వైద్యులు బెబుతున్నారు.

గమనిక: గర్భవతులు అనాస పండుకి దూరంగా ఉండడం మంచిది. ప్రెగ్నెంట్ సమయంలో ఫైనాపిల్ తింటే గర్భం పోయే ఛాన్స్ ఉంది. కనుక గర్భవతులు అనాస పండుని తినకూడదు.

Also Read: పిల్ల కప్ప ,తల్లి కప్ప అంటూ.. కప్పలతో ఆడుకుంటున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో