Megastar Chiranjeevi: మెగాస్టార్‌కు అమరావతి సెగ

రెండు నెలల అమరావతి ఉద్యమం వేదిక హైదరాబాద్‌కు రానుంది. అమరావతి రాజధానికి మద్దతు కూడగడుతున్న రైతాంగం హైదరాబాద్‌లో ఒకరోజు మహా ధర్నాకు సిద్దమవుతున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటి ఎదురుగా..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌కు అమరావతి సెగ
Follow us

|

Updated on: Feb 29, 2020 | 11:08 AM

Amaravati farmers to stage dharna in front of Chiranjeevi house in Hyderabad: మెగాస్టార్ చిరంజీవికి అమరావతి రైతుల ఆందోళన సెగ తగలనుంది. మూడు రాజధానుల విషయంలో ఇంత వరకు ఎలాంటి వైఖరిని వెల్లడించని మెగాస్టార్ చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి ఏరియా రైతాంగం.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు.

Read this: హైదరాబాద్‌లో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు బంద్!

మూడు రాజధానులు వద్దు.. అమరావతి రాజధానే కావాలంటూ గత 72 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా రైతాంగం రోజుకో విధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ కృష్ణమ్మ సన్నిధిలోను, షిరిడీ సాయిబాబా సన్నిధిలోను ప్లకార్డులను ప్రదర్శించిన అమరావతి ఏరియా ప్రజలు, రైతులు, మహిళలు… తాజాగా చిరంజీవి మౌనంపై మండిపడుతున్నారు. ఆఖరుకు వివాహ వేదికల్లోను ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభిమతాన్ని వ్యక్తం చేస్తుంటే.. చిరంజీవి మాత్రం మూడు రాజధానులకు వ్యతిరేకమా లేక అనుకూలమా తెలియజేయకుండా.. మౌనంగా సినిమాలకు పరిమితమయ్యారని అమరావతి వాసులు భావిస్తున్నారు.

Read this: జనసేన ఏకైక ఎమ్మెల్యే వెరైటీ కామెంట్స్

చిరంజీవికి తమ డిమాండ్ తెలిపి.. ఆయన మద్దతు పొందేందుకు అమరావతి రైతులు సిద్దమవుతున్నారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసం ముందు భారీ ధర్నాకు అమరావతి రైతాంగం పిలుపునిచ్చింది. అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో చిరంజీవి నివాసం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అమరావతి ఏరియా ప్రజలు, అమరావతికి మద్దతిస్తున్న వారు పెద్ద ఎత్తున తరలిరావాలని యువజన జేఏసీ పిలుపునిచ్చింది.

Read this: చంద్రబాబు దారి జైలుకే… రోజా జ్యోతిష్యం నిజమేనా?