Anushka Shetty: ఆ దర్శకుడి తనయుడితో అనుష్క పెళ్లి..!

నేను పెళ్లి చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను అని యోగా బ్యూటీ అనుష్క ఎన్నిసార్లు చెప్పినా.. ఆమె వివాహంపై మాత్రం రూమర్లు ఆగడం లేదు. గతంలో ప్రభాస్, నిమ్మగడ్డ ప్రసాద్, నాగ చైతన్య ఇలా పలువురితో అనుష్క పెళ్లి అవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

Anushka Shetty: ఆ దర్శకుడి తనయుడితో అనుష్క పెళ్లి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 27, 2020 | 5:14 PM

Anushka: తాను పెళ్లి చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను అని యోగా బ్యూటీ అనుష్క ఎన్నిసార్లు చెప్పినా.. ఆమె వివాహంపై మాత్రం రూమర్లు ఆగడం లేదు. గతంలో ప్రభాస్, నిమ్మగడ్డ ప్రసాద్, నాగ చైతన్య ఇలా పలువురితో అనుష్క పెళ్లి అవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పుకార్లకు అప్పట్లోనే చెక్ పెట్టేసింది ఈ జేజమ్మ. ఇక మొన్నటికి మొన్న ఓ టీమిండియా క్రికెటర్‌ను అనుష్క పెళ్లాడబోతుంది అన్న గాసిప్ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. వాటిపై స్పందించిన జేజమ్మ.. ఆ పుకారును కూడా కొట్టేసింది. ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ ఏదో బాధగా ఉందని చెప్పిన అనుష్క.. అదే సమయంలో పెళ్లిపై కూడా ఓ స్పష్టను ఇచ్చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటా. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాన్నే చేసుకుంటాను అని అనుష్క చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసి వారం కూడా గడవకముందే అనుష్క పెళ్లికి సంబంధించిన మరో గాసిప్ ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. అనుష్క ఓ దర్శకుడి తనయుడిని పెళ్లాడబోతోందట.

ఆయనకు ఇది వరకే వివాహం జరగ్గా.. కొన్నేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకొని, ఇప్పుడు సింగిల్‌గా ఉన్నారట. అంతేకాదు ఆయన దర్శకత్వంలోనూ అనుష్క నటించింది. ఇక ఇప్పుడు అతడిని వివాహం చేసుకునేందుకు అనుష్క రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికే పెళ్లి రూమర్లపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తోన్న అనుష్క.. ఈ గాసిప్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే గతేడాది సైరా చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసిన అనుష్క.. ఇప్పుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే చిత్రంలో నటించింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: అతనినే పెళ్లి చేసుకుంటా: అనుష్క