అది టీడీపీ నేతలకే బంగారు బాతు : టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో మల్లాది విష్ణు ఆరోపణలు

అది టీడీపీ నేతలకే బంగారు బాతు : టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో మల్లాది విష్ణు ఆరోపణలు

అమరావతిలో మరోసారి రాజధాని రచ్చ మొదలైంది. అధికార విపక్ష నేతలు మాటల యుద్ధం ప్రారంభించారు. రాజధానిపై నిపుణుల కమిటీ చర్చించి ఓ నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి అమరావతి రాజధాని నిర్మాణం వార్తల్లో నిలిచింది. శుక్రవారం టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌ లైవ్‌లో ఇదే అంశంపై హాట్ డిస్కషన్ జరిగింది. ఈ చర్చలో టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీజేపీ నేత పాతూరి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 10:05 PM

అమరావతిలో మరోసారి రాజధాని రచ్చ మొదలైంది. అధికార విపక్ష నేతలు మాటల యుద్ధం ప్రారంభించారు. రాజధానిపై నిపుణుల కమిటీ చర్చించి ఓ నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి అమరావతి రాజధాని నిర్మాణం వార్తల్లో నిలిచింది. శుక్రవారం టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌ లైవ్‌లో ఇదే అంశంపై హాట్ డిస్కషన్ జరిగింది. ఈ చర్చలో టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ పూర్తి క్లారిటీతో ఉందని, గత ప్రభుత్వ హాయంలో చంద్రబాబు రాజధాని పేరుతో ఎంతో అవినీతికి పాల్పడ్డారని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రజల అభిప్రాయలను పూర్తిగా తెలుసుకోడానికి ఇప్పటికే నిపుణుల కమిటీని వేశామని అది వచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యమని ఇది వైసీపీ మేనిఫెస్టోలో కూడా ఉందన్నారు.
ఇక ఇదే చర్చలో అమరావతి బంగారు బాతును చంపేస్తున్నారన్న టీడీపీ అధినే చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా వాడీ వేడిగా చర్చ సాగింది. రాజధాని కేవలం టీడీపీ నేతలకే బంగారు బాతు అని విమర్శించారు, చంద్రబాబు, మురళీ మోహన్, కాంట్రాక్టర్లకు, పయ్యావుల కేశవ్‌ వంటి వాళ్లకు బంగారు బాతు వంటిదని తీవ్రస్ధాయిలో ఆరోపించారు మల్లాది విష్ణు. రాజధాని పేరుతో నిర్మించిన భవనాల వల్ల ఎవరికి లాభం వస్తుందో చెప్పాలని విష్ణు ప్రశ్నించారు. అయితే దీనిపై టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ హాయంలో అన్నిప్రాంతాలు అభివృద్ధి చేశామని, హైదరాబాద్ నుంచి అమరావతికి రావడం వెనుక ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో పలువురు కాంట్రాక్టర్లకు ఎందుకు ఎక్కువకు కట్టబెట్టారని మల్లాది విష్ణు టీడీపీని నిలదీశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu