Alludu Adhurs Movie : చలికి వణుకుతూ చిందులేసిన బెల్లంకొండ శ్రీనివాస్-నభా నటేశ్.. మేకింగ్ వీడియో రిలీజ్
Alludu Adhurs Movie : 'రాక్షసుడు' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లం కొండ శ్రీనివాస్ తాజాగా 'అల్లుడు అదుర్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

Alludu Adhurs Movie : ‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లం కొండ శ్రీనివాస్ తాజాగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ‘అల్లుడు అదుర్స్’ కు సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ‘నదిలా నదిలా..’ అంటూ సాగే సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.
అద్భుతమైన లిరిక్స్ తో సాగిన ఈ సాంగ్ కోసం చాలానే కష్టపడ్డారు చిత్రబృందం.. ఈ పాటను కశ్మీర్, శ్రీనగర్ లోని అందమైన మంచు పర్వత ప్రాంతాల మధ్య షూట్ చేశారు. శ్రీనగర్, కశ్మీర్ లో భారీగా మంచు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఎంతో కష్టపడి పాటను షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బెల్లంకొండ శ్రీనివాస్-నభా నటేశ్ చలికి వణుకుతూ ఈ పాటను చేశారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనూసూద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అను ఇమాన్యుల్ మరో హీరోయిన్ గా నటించింది.
So much of hardwork to show you all the beautiful locations in this Breezy melody #NadhilaNadhila ❤️ Enjoy “?????? ??????” with your families in theaters now!@BSaiSreenivas @SonuSood @NabhaNatesh @ItsAnuEmmanuel @ThisIsDSP #SanthoshSrinivas #SumanthMovieProductions pic.twitter.com/XwGzBYTm6C
— BARaju (@baraju_SuperHit) January 14, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Salaar movie : సెట్స్ పైకి ప్రభాస్ కొత్తసినిమా.. ‘సలార్’కు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్