Salaar movie : సెట్స్ పైకి ప్రభాస్ కొత్తసినిమా.. ‘సలార్’కు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే..ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు డార్లింగ్.

Salaar movie : సెట్స్ పైకి ప్రభాస్ కొత్తసినిమా.. 'సలార్'కు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:27 PM

salaar movie : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు డార్లింగ్. ఇక ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ లో నటిస్తున్నాడు. వీటితో పాటు ‘కేజీఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సలార్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. ‘స‌లార్’ను జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ‘స‌లార్’కు జ‌న‌‌వ‌రి 15న ముహూర్తం పూజను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కన్నడ స్టార్ హీరో యష్, దర్శకధీరుడు రాజమౌళి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్ట‌ర్ అశ్వ‌త్‌నారాయ‌ణ్ సీఎన్ హాజరుకానున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ ఎలా చూపిస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.