అల్లు అర్జున్‌ను విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ చేశారు. సంక్రాంతి కానుకగా బన్నీకి రౌడీ బ్రాండ్ దుస్తులను పంపించారు దేవరకొండ. ఇక ఆ గిఫ్ట్‌కు ఫిదా అయిన స్టైలిష్ స్టార్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘చెప్పినట్లుగానే కొత్త బట్టలు పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్ విజయ్. ‘అల’ విజయోత్సవ వేడుకల్లో వీటిని వేసుకుంటానని’ ఆయన ట్వీట్ చేశారు.
THANK YOU VERY
MUCH MY DEAR BROTHER VIJAY @TheDeverakonda . VERY SWEET GESTURE. AS PROMISED U SENT ME CLOTHES . YOU WILL BE SEEING ME WITH IT DURING #AVPL CELEBRATIONS #ROWDY #Manofwords pic.twitter.com/lY7BWGDzuE— Allu Arjun (@alluarjun) January 11, 2020
ఇక అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి.