Air Quality Dips: దీపావళి టపాసుల మోత, ఢిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం, నిషేధాన్ని ఖాతరు చేయని జనం
ఢిల్లీలో ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు వాయు కాలుష్యం పెరిగిపోతుండగా వీటిని కొంతలో కొంతయినా అదుపు చేసేందుకు ప్రభుత్వం బాణసంచా కాల్చడం పైనా, అమ్మకాలపైనా..
ఢిల్లీలో ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు వాయు కాలుష్యం పెరిగిపోతుండగా వీటిని కొంతలో కొంతయినా అదుపు చేసేందుకు ప్రభుత్వం బాణసంచా కాల్చడం పైనా, అమ్మకాలపైనా బ్యాన్ విధించింది. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్ఛే దీపావళి నాడు టపాకాయలు కాల్చకపోతే ఏం మజా అనుకున్న జనాలు ఈ బ్యాన్ ను గాలికి వదిలేసి మరింత రెచ్చిపోయి పటాసులు కాల్చి ఎంజాయ్ చేశారు. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న నగర వాతావరణం మరింత దారుణంగా మారింది. కాలుష్యం విపరీతంగా పెరిగింది. సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పరిమిత స్థాయిని దాటి ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టించింది. ఎయిర్ క్వాలిటీ వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా హెచ్చు స్థాయిలో నమోదయింది. ప్రజలు బాణాసంచా కాల్చకుండా ఇళ్లలోనే ఉండి లక్ష్మీ పూజలు చేసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇఛ్చిన పిలుపును ఒక్కరైనా ఖాతరు చేస్తే ఒట్టు ! పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఉండికూడా లేనట్టే అయింది.
Delhi: Air quality deteriorates in the national capital; visuals from ITO area where Air Quality Index (AQI) stands at 461, according to Delhi Pollution Control Committee (DPCC) data. pic.twitter.com/uuCU790D5K
— ANI (@ANI) November 15, 2020