ఆ వీర మీసమేదీ అభినందన్..!

ఆ వీర మీసమేదీ అభినందన్..!

భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లోకి చేరారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ధానోవోతో కలిసి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మిగ్-21 విమానాన్ని అభినందన్ నడిపారు. సుమారు ఐదున్నర నెలల విరామం తరువాత తనకు ఎంతో ఇష్టమైన మిగ్ 21 యుద్ధ విమానంతో గగనంలోకి దూసుకెళ్లారు అభినందన్. ఈ సందర్భంగా మీసాలను తొలగించిన ఆయన కొత్త లుక్‌లో కనిపించారు. కాగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌‌పై భారత్ చేసిన వైమానిక దాడుల తరువాత ఇరు దేశాల […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 04, 2019 | 2:24 PM

భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లోకి చేరారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ధానోవోతో కలిసి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మిగ్-21 విమానాన్ని అభినందన్ నడిపారు. సుమారు ఐదున్నర నెలల విరామం తరువాత తనకు ఎంతో ఇష్టమైన మిగ్ 21 యుద్ధ విమానంతో గగనంలోకి దూసుకెళ్లారు అభినందన్. ఈ సందర్భంగా మీసాలను తొలగించిన ఆయన కొత్త లుక్‌లో కనిపించారు.

Abhinandan

కాగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌‌పై భారత్ చేసిన వైమానిక దాడుల తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన యుద్ధ విమానాలు భారత్‌లోకి వస్తుండగా.. వాటిని వెంటాడే క్రమంలో ఆ దేశ ఆర్మీకి చిక్కాడు అభినందన్. ఆ తరువాత ఆ దేశ సైనికులు అభినందన్‌ను హింసించినప్పటికీ.. తెగువ, ఆత్మస్థైర్యంతో భారత రహస్యాలను బయట పెట్టలేదు మన వింగ్ కమాండర్. ఇక అభినందన్‌ను అరెస్ట్ చేయడంపై భారత్‌ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంతో పాక్‌ ఎట్టకేలకు అతడిని విడుదల చేసింది. ఆ తరువాత అన్ని మెడికల్ టెస్ట్‌ల అనంతరం దాదాపు ఐదున్నర నెలలు విశ్రాంతి తీసుకున్న అభినందన్ తాజాగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీరచక్ర’ పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu