Vijay Sankalpa Yatra: దూకుడు పెంచిన కమలనాథులు.. పల్లె పల్లెలో విజయ సంకల్ప యాత్రలు
తెలంగాణలో రోజురోజుకు లోక్‌సభ ఎన్నికల పోరు వేడి పెరుగుతోంది. టార్గెట్ 370 అని మోదీ అంటుంటే.. వై నాట్ 17 అంటున్నారు తెలంగాణ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశపరిచినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా కసరత్తు చేస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టారు.

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించింది. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో విజయసంకల్పయాత్ర గ్రాండ్‌గా ప్రారంభించారు బీజేపీ నేతలు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.
రాజకీయ విమర్శలు లేకుండా ఎంతో భిన్నంగా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విజయసంకల్ప సభ సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని తేల్చి చెబుతున్న తెలంగాణ బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ గెలవడం వల్ల ఎలాంటి లాభం ఉండదని అంటున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ దేశ ప్రజలకు అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్, PM కిసాన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆయుష్మాన్ భారత్, PM ఉజ్వల, ప్రధాన మంత్రి కిసాన్ ఎనర్జీ సెక్యూరిటీ వంటి అనేక కేంద్ర పథకాలను తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని నేతలు కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…