జెఎన్‌యు ఘటనపై.. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముసుగులు ధరించిన గూండాల హింసాత్మక దాడుల తరువాత, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ అసమ్మతి స్వరాలను వినిపించారు. వారు ఆకస్మిక నిరసన వ్యక్తం చేస్తూ.. వీటిని దారుణమైన అణిచివేత చర్యలుగా పేర్కొన్నారు. ముంబై వ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర సమావేశమయ్యారు. వారు దుండగులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక […]

జెఎన్‌యు ఘటనపై.. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 06, 2020 | 11:03 AM

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముసుగులు ధరించిన గూండాల హింసాత్మక దాడుల తరువాత, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ అసమ్మతి స్వరాలను వినిపించారు. వారు ఆకస్మిక నిరసన వ్యక్తం చేస్తూ.. వీటిని దారుణమైన అణిచివేత చర్యలుగా పేర్కొన్నారు. ముంబై వ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర సమావేశమయ్యారు. వారు దుండగులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కు చెందిన విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్‌ హస్తం ఉందని ఆరోపించారు.

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు.. జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపక సభ్యులకు సంఘీభావం తెలిపూతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ లో కూడా విద్యార్థులు ప్రదర్శనలను నిర్వహించారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా అర్థరాత్రి నిరసనలు చేపట్టారు. జామియా టీచర్స్ అసోసియేషన్ (జెటిఎ) ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.

ముసుగు దుండగులు క్యాంపస్‌లో భీభత్సం సృష్టిస్తున్న సమయంలో.. క్యాంపస్‌లోని పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మౌనంగా ఉండిపోయారని జెఎన్‌యు విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఆరోపించారు. నిందితులు పారిపోయేందుకు సహకరించారని వారు ఆరోపించారు. ఈ చర్యను ఖండిస్తూ వందలాది మంది ఢిల్లీలోని ఐటిఓ జంక్షన్ వద్ద ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల గుమిగూడారు.

ఆదివారం సాయంత్రం సాయుధ దుండగులు అనేక మంది విద్యార్థులు, అధ్యాపక సభ్యులపై దాడి చేశారు, వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముసుగు దుండగులు క్యాంపస్‌లోని హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థులపై దాడి చేశారు. గాయపడిన వారిలో సుమారు 12 మంది ఉపాధ్యాయులు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఐషే ఘోష్ ఉన్నారు.

[svt-event date=”06/01/2020,3:34AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”06/01/2020,3:35AM” class=”svt-cd-green” ]

[/svt-event]