AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన స‌ర్వీస్‌ల‌పై కేంద్రం క్లారిటీ..

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా మే 3వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఈ లాక్‌డౌన్ కొన‌సాగించ‌డంపై క్లారిటీ వ‌స్తుంది. అయితే ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి సంస్థ‌లు వ‌చ్చేనెల‌లో లోక‌ల్ విమాన స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేస్తామ‌ని తాజాగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కేంద్రం స్ప‌ష్ట‌తనిచ్చింది. విమాన ప్ర‌యాణాల‌పై గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాల‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ […]

విమాన స‌ర్వీస్‌ల‌పై కేంద్రం క్లారిటీ..
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2020 | 9:06 AM

Share

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా మే 3వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఈ లాక్‌డౌన్ కొన‌సాగించ‌డంపై క్లారిటీ వ‌స్తుంది. అయితే ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి సంస్థ‌లు వ‌చ్చేనెల‌లో లోక‌ల్ విమాన స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేస్తామ‌ని తాజాగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కేంద్రం స్ప‌ష్ట‌తనిచ్చింది. విమాన ప్ర‌యాణాల‌పై గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాల‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.

ఇప్ప‌టివ‌ర‌కైతే విమానయాన శాఖ.. ప్ర‌యాణాల‌పై ఎలాంటి నిర్ణ‌యాల‌ను తీసుకోలేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు వ‌చ్చేనెల 4 నుంచి దేశీయ విమాన ప్ర‌యాణాలను ప్రారంభించేందుకుగాను ఇప్ప‌టికే ఎయిర్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. అలాగే జూన్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ విమాన స‌ర్వీస్‌ల‌ను ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తోంది.